ఎ. కోడూరు లో చంద్రన్న ఆరోగ్య సంచార చికిత్స

ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు గారు జన్మదినం సందర్భంగా అన్ని జిల్లాల్లోనూ ‘చంద్రన్న సంచార వైద్య చికిత్స సేవలు’ పథకాన్ని ప్రారంభించిన సంగతి మనకు తెలిసినదే. 

అయితే మన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశ పెట్టిన చంద్రన్న ఆరోగ్య సంచార చికిత్స సేవలు మన వూరి లోకి  కూడా రావటం చాల ఆనందం కలిగించింది.

ఎందుకంటే వయసు మళ్ళిన వారు సాదారణంగా మరో వూరు వెళ్లి డాక్టర్ గారికి చూపించు కోవాలంటే ఎంతో కష్టం. అటువంటిది ఈ సంచార ఆరోగ్య  చికిత్స వలన మన వూరిలో ఎంతో మందికి ఉపయోగ పడటం చూసి నేను ఎంతో ఆనందించాను. 

చంద్రన్న సంచార వైద్య చికిత్స సేవలు పథకం వలన ఉపయోగాలు:
-------------------------------------------------------------------------------------
.సంచార వైద్య వాహనాలు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తారు.  
.రోగులకు ఉచిత సిటి స్కాన్ సేవలు, మరియు 
.చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వంటివి ఈ పథకంలో ఉంటాయి.
.అత్యవసర వైద్య సేవలందిస్తున్న 108 వాహనాల మాదిరిగానే ఇవి కూడా పనిచేస్తాయి. ఇందుకోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్ 1962ను కేటాయించారు. జిల్లాలో వైద్య సేవల నిమిత్తం ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే వాహనంతోపాటు సిబ్బంది అక్కడికి చేరుకుని తగిన సేవలు అందిస్తారు.
.అవసరమైన మందులూ ఇస్తారు. 
.నియోజకవర్గంలో ఉండే వాహనం ఆ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అన్ని మండలాల్లో సేవలు అందిస్తుంది. 
.రాత్రి అనే తేడా లేకుండా ఏ క్షణం అవసరం పడినా ఫోన్ చేయొచ్చు. అంటే 24 గంటల పాటు ఈ సేవలను పొందవచ్చును. 

పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు, సంపూర్ణ ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలన్నదే తన లక్ష్యముగా పెట్టుకున్న మన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గార్కి కృతఙ్ఞతలు తెలుపుకుంటూ,  అలాగే మన ఆంధ్రప్రదేశ్ఆ రోగ్య శాఖ మంత్రి గారికి మనం కూడా అందరము కృతఙ్ఞతలు తెలుపుకుందాము.

మన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గార్కి ఇలాగె ఇంకా ఎన్నో వున్నత మైన మంచి ఆలోచనలు భగవంతుడు కలిగించి తద్వారా ప్రజల యొక్క ఆదరాభిమానములు పొందాలని
కోరుకుంటున్నాను. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని మనం అందరము కోరుకుందాము. 

అలాగే మనం అందరం కూడా ఈ ఆరోగ్య సంచార చికిత్స సేవను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. 

ఇట్లు,
- ఎ. మహేశ్వర రావు 

Comments