Posts

Showing posts from March, 2022

ఎ. కోడూరు లో మల్లిఖార్జున స్వామి - భ్రమరాంభిక దేవాలయం

Image
చక్కటి పచ్చిక బైళ్ళతో దేవాలయం చుట్టూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో మహా శివుడు ధ్యానం లో పెద్ద విగ్రహంగా కొలువైవున్నారు.  తపస్సులో వున్న మహా శివుడు పెద్ద విగ్రహం ఈ వూరికి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఈ ద్యాన ముద్రలో వున్న మహాశివుడు విగ్రహం చాల బావుంటుంది.    అసలు ఎవరైనా ధ్యానం లో కూర్చోవాలన్న, తపస్సు కొన్ని గంటలు / రోజులు చేయాలన్న ఆ మహా శివుడు ఆసీనులై వున్న విధానం లో మనం కూడా కూర్చుంటే చాలు, మనం కూడా ఎక్కువ సేపు ధ్యానం లో అలా వుండి పోవొచ్చు.  ఎవరైనా ధ్యానం లో కూర్చోవాలంటే ఈ మహా శివుడు తప్పస్సు లో కూర్చొనే విధానం నేర్చుకుంటే చాలు.  తపస్సుకి, ధ్యానానికి ఈ విగ్రహమే మనకు ఆదర్శముగా వుంటుంది.   "ఓం నమః శ్సివాయ!"    అలాగే మహా శివున్ని చూస్తూ నందీశ్వరుని విగ్రహం - పెద్ద విగ్రహం వుంటుంది. తపస్సులో వున్న  మహా శివునికి కాపలాగా ఉంటూ ఈ దేవాలయాన్ని రక్షించేది కూడా ఈ నందీస్వరుడనే చెప్పు కో వొచ్చు. నందీశ్వరుని కి ఎంత అదృష్టం మహా శివుడ్ని చూస్తూ అలా వుండిపోవడం.  అసలు ముందు మహా శివుని వద్దకు మరియు విగ్రహ మూర్తికి అబిషేకం చేసే ముందర  నందీశ్వరుని అనుమతి తీసుకొనే ఆ మహా శివుని వద్దకు వెళ్ళ