ఎ. కోడూరు లో మల్లిఖార్జున స్వామి - భ్రమరాంభిక దేవాలయం

చక్కటి పచ్చిక బైళ్ళతో దేవాలయం చుట్టూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో మహా శివుడు ధ్యానం లో పెద్ద విగ్రహంగా కొలువైవున్నారు.  తపస్సులో వున్న మహా శివుడు పెద్ద విగ్రహం ఈ వూరికి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఈ ద్యాన ముద్రలో వున్న మహాశివుడు విగ్రహం చాల బావుంటుంది.   

అసలు ఎవరైనా ధ్యానం లో కూర్చోవాలన్న, తపస్సు కొన్ని గంటలు / రోజులు చేయాలన్న ఆ మహా శివుడు ఆసీనులై వున్న విధానం లో మనం కూడా కూర్చుంటే చాలు, మనం కూడా ఎక్కువ సేపు ధ్యానం లో అలా వుండి పోవొచ్చు.  ఎవరైనా ధ్యానం లో కూర్చోవాలంటే ఈ మహా శివుడు తప్పస్సు లో కూర్చొనే విధానం నేర్చుకుంటే చాలు.  తపస్సుకి, ధ్యానానికి ఈ విగ్రహమే మనకు ఆదర్శముగా వుంటుంది.  

"ఓం నమః శ్సివాయ!"   

అలాగే మహా శివున్ని చూస్తూ నందీశ్వరుని విగ్రహం - పెద్ద విగ్రహం వుంటుంది. తపస్సులో వున్న  మహా శివునికి కాపలాగా ఉంటూ ఈ దేవాలయాన్ని రక్షించేది కూడా ఈ నందీస్వరుడనే చెప్పు కో వొచ్చు. నందీశ్వరుని కి ఎంత అదృష్టం మహా శివుడ్ని చూస్తూ అలా వుండిపోవడం. 

అసలు ముందు మహా శివుని వద్దకు మరియు విగ్రహ మూర్తికి అబిషేకం చేసే ముందర  నందీశ్వరుని అనుమతి తీసుకొనే ఆ మహా శివుని వద్దకు వెళ్ళాలని ధర్మ శాస్త్రం లో రాసి పెట్టారు. నందీస్వరి అనుగ్రం పొందిన తరువాతే  ఆ మహా శివుని వద్దకు వెళ్ళడానికి మనకి అనుమతి వుంటుంది. ఇది మనం గుర్తు ఉంచు కోవలసిన విషయం. 

ఈ మహాశివుని విగ్రహం మన విశాఖపట్నం లో కైలాస గిరి లో వున్న పార్వతి పరమేశ్వరులు విగ్రహం తరువాత ఇదే రెండో అతి పెద్ద విగ్రహం గా ఈ జిల్లాలో ఈ వూరిలో కొలువై వున్నది గా మనం చెప్పుకోవోచ్చు.  

ఈ పెద్ద విగ్రహం ఈ మల్లి ఖార్జున స్వామి వారి అలయానికి మంచి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా కూడా వుందని అందరూ అంటూ వుంటారు కూడా. అలాగే వున్నది కూడా.

ఈ ఎ. కోడూరు టెంపుల్ లో ఏమేమి విగ్రహ మూర్తులు కొలువై వున్నారు?

ఎ. కోడూరు లో విఘ్నేశ్వరుడు, శ్రీ మల్లిఖార్జున స్వామి - శ్రీ భ్రమరాంభ దేవాలయం తో పాటు , సరస్వతి దేవి, అయ్యప్ప స్వామి, నాగేంద్రుడు విగ్రహములు తో పాటు నవగ్రహాలు కొలువై వున్నాయి.

  

1) కోవెలలో కొలువై వున్న విఘ్నేశ్వరుడు వద్ద విగ్నాలు కలుగ కుండా విఘ్నేశ్వరుని పూజ చేసుకోవొచ్చు.

2) కోవెలలో కొలువై వున్న మహా శివుని విగ్రహ మూర్తి శివలింగ రూపం లో వున్నారు. ఆ శివునికి  అభిషేకము చేసుకోవొచ్చు మీ మంచి కోరికలు తీరడానికి.

3) కోవెలలో కొలువై వున్న విగ్రహ రూపం శ్రీ భ్రమరాంబికా దేవిగా వున్నారు. ఆ దేవికి ఇక్కడ కుంకుమ పూజలు చేస్తారు.

4) కోవెల వెనుక శ్రీ సరస్వతి దేవి విగ్రహరూపం లో చెట్టు క్రింద వున్నారు.  ఇక్కడ  చిన్న పిల్లలకి సరస్వతి దేవి పూజ చేసి చదువును ప్రారంబించవొచ్చు.  ఇక్కడ అందరూ జ్ఞానం కోసం సరస్వతిపూజ చేసుకోవొచ్చు.

5) ఈ కోవెలలో ఎడమ వైపు నవగ్రహ దేవతలు కొలువై వున్నారు.  ఇక్కడ శని త్రయోదశి రోజున పూజలు చేసుకోవొచ్చు.  గ్రహ ఇబ్బందులు వుంటే వాటి పూజలు చేసుకోవొచ్చు.  

6) ఈ కోవెలలో కుడి వైపు నాగ దేవత కొలువై వున్నది. ఇక్కడ నాగ పంచమి రోజు, నాగుల చవితి రోజు పూజలు చేసుకోవొచ్చు. కుజ దోషం వున్నా వారు కూడా ఇచ్చట పూజలు చేసుకుంటారు. అంటే సుబ్ర మణ్యస్వామి గా ఈ నాగేంద్రుని ని కొలుస్తారు.  

7) ఈ కోవెలలో ముందుగా ఎడమ వైపు రావి చెట్టు పక్కన అయ్యప్ప స్వామి కొలువై వున్నారు. ఇచ్చట అయ్యప్పస్వామి దీక్ష తీసుకున్నవారు అందరూ ఈ కోవెలలో నిద్రిస్తూ అక్కడే ఉంటూ పూజలు నిర్వహిస్తారు.  అలాగే శివ దీక్ష తీసుకున్న వారు కూడా.  

8) నట రాజ స్వ్వామి విగ్రహ రూపం లో ఈ గుడి కి కుడి వైపు భావి ముందర కొలువై వున్నారు. మనకు తెలుసు సంధ్యా సమయాలలో శివుడు నాట్యమ్ చేస్తూ వుంటారు.  ఆ సమయం లో దేవతలందరూ ఆ టైం కి అక్కడకి చేరుకుంటారు ఆ మహా శివుని నృత్యాన్ని చూడటానికి.

8) కాల బైరవుని విగ్రహము త్వరలో కొలువై వుంటుంది.  నందీశ్వరుని విగ్రహం దగ్గరలో. 

9) ఆంజనేయ స్వామి కోవెల ఎడమ వైపు ముందరే వుంటుంది.

ధ్యానం లో వున్నమహాశివుని పెద్ద విగ్రం ఎక్కడ వుంటుంది విశాఖ జిల్లలో?

K. కోటపాడు మండలం దాటి A. కోడూరు 4 రోడ్లు కూడలికి వచ్చి - ఎడమ వైపు తిరిగి చెరువు పక్క నుంచి govt బోర్డ్ స్కూల్ దాటి ముందుకు వెళితే అక్కడే శ్రీ మహా శివుడు మనకు ధ్యాన ముద్ర లో ఎంతో చక్కగా కనిపిస్తారు. ఓం మహా శివా! నీకు జయము!

---

#akoduru, #kkotapadu, #visakha, #visakhapatnam, #visakhapatnamjilla, #akoduruvillage, #sivatemple, #mahadyaanavigraham, #sivunidhyaanavigraham, #loardsivatempleinakoduru, #akodurusivatemple, #srimallikhaarjunabramaraambhatempleinakoduru,

Comments

Popular posts from this blog

ఎ. కోడూరు లో చంద్రన్న ఆరోగ్య సంచార చికిత్స